
నారాయణపేట, వెలుగు: మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో జరిగే సీఎం సభకు నారాయణపేట నియోజకవర్గం నుంచి మహిళలను పెద్ద ఎత్తున తీసుకురావాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కోరారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో నారాయణపేట, ధన్వాడ, మరికల్, దామరగిద్ద మండలాల ఐకేపీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సభ కోసం మహిళలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని కోరారు. దామరగిద్దలో రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు.